రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అర్చకులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేపట్టారు. ఆలయంలో దేవతలకు ప్రత్యేక అర్చనలు, పూజలు చేశారు. సాయంత్రం స్వామి వారి కల్యాణ మండపంలో మహాలింగార్చన పూజ నిర్వహించారు. 366 చిరు లింగాలను లింగాకారంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండీ : వేములవాడలో భక్తుల రద్దీ.. నిబంధనల మేర దర్శనాలు..