KTR Visit Siricilla Today : రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బీఆర్‌ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజాగొంతుకై పోరాడతామని స్పష్టం చేశారు. సిరిసిల్ల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్న కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని భరోసా ఇచ్చారు.
KTR, Telangana Elections Results 2023 Live : కాంగ్రెస్‌కు గుడ్ లక్ - ఓడిపోయామని బాధగా ఉన్నా
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సిరిసిల్లా నియోజకవర్గంలో ప్రజలను ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసిన అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టారన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అనుకోని ఫలితాలను చూసి నిరాశపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. బీఆర్‌ఎస్ పోరాటాల నుంచి వచ్చిన పార్టీ అని ఒడిదొడుకులు కొత్తేమి కాదన్నారు.
KTR Latest News : కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన గొంతుకై ప్రశ్నిస్తామన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం చాలా మంది కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్‌కు ఓటువేసిన వారు కూడా మెసేజ్‌లు పెడుతున్నారన్నారు. పవర్ పాలిటిక్స్‌లో ఏదీ శాశ్వతం కాదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఓటమికి ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదని, ప్రజలు కేసీఆర్‌కు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు.
సిరిసిల్లలో పాత కథ రిపీట్ - ప్రభుత్వం ఒకటైతే, స్థానిక ఎమ్మెల్యే మరో పార్టీ
తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్ అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను వదులుకోరన్నారు. ప్రస్తుతం ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని, ఇది స్వల్ప కాలం మాత్రమే ఉంటుందన్నారు. సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, ముందు పంచనని మాట ఇచ్చానని.. ఆ మాటను నిలబెట్టుకున్నానన్నారు. ప్రజలు కూడా తన విశ్వాసాన్ని నిలబెట్టారని వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
"సిరిసిల్ల ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా నన్ను గెలిపించారు. అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను వదులుకోరు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము". - కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్