ETV Bharat / state

KTR Speech at Sircilla : 'జల్‌, జంగిల్‌, జమీన్‌.. నినాదాన్ని సాకారం చేస్తున్నాం'

KTR Speech in Sircilla Tour : సీఎం కేసీఆర్‌.. రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశారని, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో న్యాయం చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కుమురం భీం నినాదం జల్‌, జంగిల్‌, జమీన్‌ను సాకారం చేస్తున్నామని తెలిపారు. 3 వేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

KTR
KTR
author img

By

Published : Jul 6, 2023, 3:55 PM IST

KTR Rajanna Sircilla Tour Today : అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం గుప్పిస్తూ.. ఒకరి వైఫల్యాలు మరొకరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల నేతలు ఒకటే పాట పాడుతున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్​ఎస్ పార్టీ ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో పడింది. వాటిలో ప్రధాన హామీ అయిన పోడు పట్టాల పంపిణీని సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పోడు పట్టాలను లబ్ధిదారులకు అందించారు.

KTR Comments at Sircilla Meeting : మొదట జిల్లాలోని తంగళ్లపల్లిలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అదేవిధంగా కళాశాలకు బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాలగా పేరు మార్పు చేశారు. అనంతరం పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్‌.. రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశారని, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో న్యాయం చేస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. కుమురం భీం నినాదం జల్‌, జంగిల్‌, జమీన్‌ను సాకారం చేస్తున్నామని తెలిపారు.

'సీఎం కేసీఆర్‌.. రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో న్యాయం చేస్తున్నాం. కుమురం భీం నినాదం జల్‌, జంగిల్‌, జమీన్‌ను సాకారం చేస్తున్నాం. 3000 పైగా తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం. ఆరు శాతంగా ఉన్న ఎస్టీ రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచాం. పచ్చదనాన్ని 8 శాతం పెంచిన నాయకుడు కేసీఆర్‌ ఒక్కరే. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్‌ ఒక్కరే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1600 మందికి పట్టాలు ఇస్తున్నాం.'-కేటీఆర్‌, పురపాలక శాఖ మంత్రి

సీఎం కేసీఆర్‌.. రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు: కేటీఆర్‌

పచ్చదనాన్ని 8 శాతం పెంచిన నాయకుడు కేసీఆర్‌ : 3 వేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆరు శాతంగా ఉన్న ఎస్టీ రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచామని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 8 శాతం పెంచిన నాయకుడు కేసీఆర్‌ ఒక్కరేనని కొనియాడారు. అదేవిధంగా పోడు భూముల పట్టాలకు రైతుబంధు కూడా ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కేటీఆర్​తో పాటు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.