రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయం తరలివచ్చిన భక్తులతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున జ్యోతులు వెలిగించారు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పరివార దేవతార్చన అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఇదీ చూడండి : కార్తికమాస పూజలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ