రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా సందర్భంగా ఘనంగా శమీ యాత్ర నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను అంబారి సేవలో భాగంగా ఊరేగించారు. ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టుకు పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులతో పాటు ఆలయ ఈవో కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : 'జమ్మి చెట్టు దగ్గర ఇలా చేస్తే... అన్నింట్లో విజయం మీ సొంతం