స్వచ్ఛ సర్వేక్షణ్-2021లోభాగంగా సిరిసిల్ల, వేములవాడ పురపాలికల మధ్య నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ గేమ్స్‌ను కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ పురపాలికల ఛైర్‌పర్సన్‌లు... సిబ్బంది పాల్గొన్నారు. పురపాలికల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడం కోసమే ఈ క్రీడాపోటీలు నిర్వహించినట్లు కలెక్టర్ కృష్ణ భాస్కర్ వెల్లడించారు.
ఇదీ చూడండి: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష