ఇవీ చూడండి:నేడు నిజామాబాద్‌లో ఈసీ రజత్ కుమార్ పర్యటన
'ఫర్ యూ... విత్ యూ ఆల్వేస్'... షీ టీమ్స్ - district sp
మహిళలకు, విద్యార్థినులకు షీ టీమ్స్‌పై అవగాహన కల్పించేందుకు రాజన్న సిరిసిల్లలో ఎస్పీ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. ఫర్ యూ విత్ యూ ఆల్వేస్ నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు.
షీ టీమ్‌పై అవగాహన కల్పించేందుకు 2కె రన్
రాజన్న సిరిసిల్ల పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు సంవత్సరాల క్రితం షీ టీమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. షీ టీమ్ స్లోగన్... ఫర్ యూ..విత్ యూ.. ఆల్వేస్ నినాదంతో ముందుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మహిళలకు అవగాహన కల్పించాలని కోరారు.
ఇవీ చూడండి:నేడు నిజామాబాద్‌లో ఈసీ రజత్ కుమార్ పర్యటన