ETV Bharat / state

ఎక్కడ ఎన్నికలొచ్చినా సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి

దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సందడిగా మారుతోంది. ఓ వైపు బతుకమ్మ చీరల తయారీలో చేనేత కార్మికులు నిమగ్నమయ్యారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో వినియోగించే పార్టీల జెండాలు, కండువాల తయారీ ఆర్డర్లు సిరిసిల్ల నేత కార్మికులకే అందాయి. ఫలితంగా చేతినిండా పనితో చేనేత కార్మికులు తలమునకలయ్యారు.

ఎక్కడ ఎన్నికలొచ్చినా సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి
ఎక్కడ ఎన్నికలొచ్చినా సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి
author img

By

Published : Mar 18, 2021, 5:29 AM IST

ఎక్కడ ఎన్నికలొచ్చినా సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి

నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతుండడం... సిరిసిల్ల నేత కార్మికులకు కలిసొచ్చింది. పశ్చిమబంగ, తమిళనాడు, కేరళలో ఎన్నికల ప్రచారానికి కావాల్సిన జెండాలు, కండువాలను తయారు చేయించేందుకు వివిధ పార్టీల నేతలు సిరిసిల్ల నేత కార్మికులను సంప్రదించారు. పార్టీల జెండాల తయారీతో నేతన్నలకు ఉపాధి లభించింది.

చేతినిండా పని...

నేత కార్మికులు మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తుంటే, ఆ బట్టపైన వివిధ పార్టీల గుర్తులు, కండువాలను ముద్రించి, వాటిని వివిధ సైజుల్లో కత్తిరించి జెండాలు, కండువాలు తయారు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని పార్టీలనుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడం వల్ల ఇక్కడి పరిశ్రమకు ఉపాధి లభించి కార్మికులకు చేతినిండా పని దొరుకుతోంది.

శాశ్వత ఉపాధి...

పార్టీల జెండాలు, కండువాల కోసం సిరిసిల్ల వ్యాపారులకు వచ్చే ఆర్డర్లు, పేమెంట్లు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తికాగా... ఈ వస్త్రానికి తక్కువ ధర ఉండడం వల్ల ఏజెంట్లు నేరుగా ఇక్కడి వ్యాపారులకు ఆర్డర్లు ఇస్తున్నారు. పట్టణంలో సుమారు 10 మంది వ్యాపారులు పెద్ద ఎత్తున ఆర్డర్లు తీసుకోవడం వల్ల ఇక్కడి మహిళలు, నేత కార్మికులకు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లభించింది.

మెరుగ్గా ఆదాయం...

బీడీల ద్వారా వచ్చే ఆదాయం కంటే జెండాలు, కండువాల తయారీతో వచ్చే ఆదాయం మెరుగ్గా ఉందన్న కార్మికులు... శాశ్వతంగా ఉపాధి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు. నాలుగు రాష్ట్రాల్లోని ఎన్నికలతో సుమారు 1,000 మంది చేనేత కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా, మరో 500 మంది మహిళలకు పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.

ఇదీ చూడండి: సింగరేణి కార్మికులకు ఉచితంగా కరోనా టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.