రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో దేవస్థానం కిక్కిరిసింది. స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తజనులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరారు.
దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 35 వేల మంది దర్శించుకోనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఘనంగా ప్రారంభమైన లక్ష్మీగణపతి దశమ వార్షికోత్సవం