అదనంగా విధించిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ.. రాజన్న సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయం ముందు సీపీఐ, అఖిలపక్ష నాయకులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో 3 నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను అధికారులు ఇష్టం వచ్చినట్లు తీసి.. అధిక బిల్లులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికంగా విధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు సిరిసిల్లా సహకార విద్యుత్ సరఫరా సంస్థను ట్రాస్స్కోలో ప్రభుత్వం విలీనం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:ఏనుగు నోటికి గాయం- టపాసులే కారణం?