ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని కాంగ్రెస్​ ధర్నా - congress hold protest program opposing lrs

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 131ను వెంటనే రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. ఎల్​ఆర్​ఎస్​ను వెంటనే రద్దు చేయాలంయూ వేములవాడలో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Congress protest to abolish LRS in vemulawada
ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని కాంగ్రెస్​ ధర్నా
author img

By

Published : Oct 8, 2020, 3:57 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 131(ఎల్​ఆర్​ఎస్)ను వెంటనే రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్​ నేతలు రాస్తారోకో చేపట్టి తహసీల్దార్​కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం కరవు కాలంలో పేదలపై ఆర్థిక భారం వేయడం సమంజసం కాదని కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ ధ్వజమెత్తారు. న్యాయస్థానంలో సర్కారుకు వ్యతిరేకంగా మొట్టికాయలు తగిలినా.. వారి పద్ధతి మారకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్​ఆర్​ఎస్ జీవోను బేషరతుగా రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు.

Congress protest to abolish LRS in vemulawada
ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని కాంగ్రెస్​ ధర్నా

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎన్నుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు ఆది శ్రీనివాస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.