కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తున్నామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు తగిన మద్దతు ధర ప్రకటించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు, సీనియర్ నాయకులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీను, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'సాగు చట్టాలను నిలిపివేస్తారా? లేక మేమే చేయాలా?'