నాగులపంచమి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయంలోకి వెళ్లే మెట్లదారిలో పక్కన ఉన్న డ్రైనేజీ వద్ద నల్ల నాగు పాము జనాల దృష్టిలో పడింది.
కప్పను తింటున్న నాగుపామును చూసిన వెంటనే... పాములు పట్టే వ్యక్తి బాబుకు సమాచారమిచ్చారు. హుటాహుటిన వచ్చిన బాబు నాగుపామును పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయగా... ఆలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.