మహబూబాబాద్ జిల్లాలో బలవన్మరణానికి పాల్పడిన కేయూ విద్యార్థి సునీల్ నాయక్ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని... రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యల సాధన కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ కార్యాలయం లోపలికి ప్రవేశించి ఆందోళన చేస్తున్న బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: చిన్నారుల కోసం సరికొత్త థీమ్స్తో ప్లేజోన్స్