ETV Bharat / state

'మీరు రాసిచ్చిందే చదువుతారు కదా.. మరేందుకు గవర్నర్​ను పిలవలేదు'

Bandi sanjay on budget session: బడ్జెట్​ సమావేశాలకు గవర్నర్​ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రథమ మహిళను అవమానపరడం.. రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించడమేనన్నారు.

Bandi sanjay
Bandi sanjay
author img

By

Published : Mar 1, 2022, 5:35 PM IST

Bandi sanjay on budget session: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్​ సమావేశాలకు గవర్నర్​ను ఆహ్వానించకుండా అవమానపరిచారని విమర్శించారు. రాష్ట్ర ప్రథమ మహిళను అవమానపరడం.. రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించడమేనని సంజయ్​ అన్నారు. బడ్జెట్​ సమావేశాల్లో గవర్నర్​ ప్రసంగం లేకపోవడం వెనుక ఉద్దేశం ఏంటో కేసీఆర్​ చెప్పాలని సంజయ్​ డిమాండ్​ చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా.. వేములవాడలోని రాజన్న ఆలయంలో బండి సంజయ్​ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని సంజయ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధికి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద నిధులు తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నం చేస్తానని సంజయ్​ స్పష్టం చేశారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా.. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

'మహిళ గవర్నర్​ కనుకనే బడ్జెట్​ సమావేశాలకు ఆహ్వానించలేదు. ఆమేమైనా సొంతంగా ప్రసంగిస్తారా.. మీరు ఇచ్చిందే చదువుతారు కదా.. మరెందుకు పిలవలేదు. ఇప్పటి వరకు గవర్నర్​ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అవమానపరిచినట్లే..'

- బండి సంజయ్​, ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

మార్చి 7 నుంచి సమావేశాలు..

రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోగా ఆమోదించాల్సి ఉంది. ఆ లోగా ఉభయ సభలు పద్దుకు ఆమోదం తెలపాల్సి ఉండగా.. మార్చి 7 నుంచి సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 6న ప్రగతి భవన్‌లో మంత్రిమండలి సమావేశంలో పద్దుకు అమాత్యులు ఆమోదం తెలుపనున్నారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు సమాచారం ఇచ్చారు.

Bandi sanjay: 'మీరు రాసిచ్చిందే చదువుతారు కదా.. మరేందుకు గవర్నర్​ను పిలవలేదు'

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.