సన్నరకం వరిధాన్యానికి రూ.2,500 మద్ధతు ధర ఇవ్వాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వం చెప్పిన ప్రకారమే సన్నరకం పంట వేసిన రైతులకు పెట్టుబడే ఎక్కువ అయ్యిందని.. ఈనేపథ్యంలో కనీస మద్దతు ధర కూడా ప్రకటించకపోతే అన్నదాతలు అప్పులపాలు అవుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆందోళనకారులు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: ఫలితాలు బాగుంటే రాష్ట్ర వ్యాప్తంగా పత్తితీత యంత్రాలు