వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు చేదు అనుభవం ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నూకలమర్రి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘ భవనానికి శంకుస్థాపన చేయడానికి వెళుతున్న ఎమ్మెల్యేను భాజపానేతలు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి కనబడకుండా పోయారంటూ నిరసన వ్యక్తం చేశారు.
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపడతామని.. నూకలమర్రిని మండల కేంద్రం చేస్తామన్న హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలకు, భాజపా నేతలకు మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి: Etela rajender land issues: మళ్లీ తెరపైకి ఈటల భూముల వ్యవహారం.. నోటీసులు జారీ