దేశంలో నరేంద్ర మోదీ సంపూర్ణ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ముదునూరు గ్రామానికి చెందిన రాయల రవికుమార్ చేపట్టిన భాజపా సంకల్ప సైకిల్ యాత్ర రాజన్న సిరిసిల్లకు చేరుకుంది. తంగళ్లపల్లి మండల కేంద్రంలో భాజపా నాయకులు రవికుమార్కి ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో17 పార్లమెంటు స్థానాలు గెలవాలని కోరుతూ చేపట్టిన భాజపా సంకల్ప సైకిల్ యాత్ర 23 జిల్లాలను ముగించుకొని 24వ జిల్లాకు చేరడం చాలా సంతోషంగా ఉందని రవికుమార్ తెలిపారు. ఇప్పటివరకు 19 వందల కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర పూర్తైందన్నారు.
ఇవీ చదవండి: ఆర్టీసీ బస్సులో 48లక్షల నగదు లభ్యం