రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భాజపా ఆధ్వర్యంలో ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దేశ ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి రాసిన లేఖను ఇంటింటా పంపిణీ చేస్తామని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాజపా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు తీగల రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!