రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా భాజపా, ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకొంది. మంత్రిని కలిసి రెండు పడక గదుల ఇళ్లపై వినతి ఇవ్వాలని భావించినట్లు భాజపా నాయకులు పేర్కొన్నారు. అయితే మంత్రిని అడ్డుకుంటున్నారని భావించిన తెరాస నాయకులు భాజపా నాయకులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు భాజపా నాయకులను అరెస్ట్ చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. మంత్రిని కలిసి వినతి పత్రం ఇద్దామనుకుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బీసీల రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలి: కృష్ణయ్య