ETV Bharat / state

BANDI SANJAY: 'పవర్ లూమ్​ కేంద్రాల ఆధునికీకరణను వేగవంతం చేయాలి' - Bandy Sanjay latest news

కేంద్ర టెక్స్​టైల్ శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్​ను భాజపా రాష్ట్ర అధ్యక్షులు​, ఎంపీ బండి సంజయ్​ కలిశారు. సిరిసిల్ల పట్టణంలో పవర్ లూమ్​ కేంద్రాల ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు.

'పవర్ లూమ్​ కేంద్రాల ఆధునికీకరణను వేగవంతం చేయాలి'

author img

By

Published : Jul 22, 2021, 5:30 AM IST

తెలంగాణలో అతి పెద్ద టెక్స్​టైల్ హబ్​గా ఉన్న సిరిసిల్ల పట్టణంలో పవర్ లూమ్​ కేంద్రాల ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (bandi sanjay) కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర టెక్స్​టైల్ శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ (upendra prasad singh)​కు వినతి పత్రం (request letter) సమర్పించారు.

సిరిసిల్ల పట్టణం సుమారు 40 వేలకు పైగా పవర్‌ లూమ్స్​తో తెలంగాణలోనే అతిపెద్ద టెక్స్​టైల్ హబ్​గా కొనసాగుతోందని బండి సంజయ్​ పేర్కొన్నారు. అయితే మగ్గాలు పాతవి కావడంతో పాటు మగ్గాల శక్తి వినియోగం తగ్గిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పవర్ లూమ్​ ఆధునికీకరణలో భాగంగా సిరిసిల్ల పట్టణాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినప్పటికీ.. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగుతోందని .. తక్షణమే అప్ గ్రెడేషన్ (up gradation) పనులను వేగవంతం చేయాలని ఉపేంద్ర ప్రసాద్​సింగ్​ను కోరారు.

సాధారణ వర్క్ షెడ్ భవనాల నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాలి..

సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం (సీహెచ్​సీడీఎస్) పథకం కింద సాధారణ వర్క్ షెడ్ భవనాల నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని బండి సంజయ్​ పేర్కొన్నారు. ఇవి సొసైటీల యాజమాన్యంలో ఉంటున్నందున లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర పథకంలో భాగంగా సిరిసిల్లలో పవర్‌లూమ్ చేనేత కార్మికుల జియో ట్యాగింగ్ (jio tagging) పురోగతిలో ఉందని, ఈ పథకాన్ని "పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి" కు అనుగుణంగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రత్యేక బీమా పథకాన్ని పునరుద్ధరించాలి..

చేనేత కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం గతంలో అమలైన ప్రత్యేక బీమా పథకం(special insurance scheme)ను పునరుద్ధరించాలని బండి సంజయ్ కోరారు. గతంలో అమలు చేసిన ఈ పథకం చేనేత శాఖతో ఒప్పందం చేసుకున్న ఆసుపత్రులు, క్లినిక్​లలో జలుబు, జ్వరం వంటి సాధారణ రోగాలకు సైతం ఉచితంగా చికిత్స ఉండేదని గుర్తుచేశారు. అయితే ఈ పథకాన్ని సవరించడంతో పాటు పరిమితి కూడా విధించడంతో తరువాత నిలిపివేశారని తెలిపారు. ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నేత కార్మికులు అభ్యర్థిస్తున్న విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ఆ సమస్యలను ప్రాధాన్యతల వారీగా పరిశీలించి చేనేత కార్మిక ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి:

BANDI SANJAY: 'ఏడేళ్ల తర్వాత నిద్రలేచి ఇప్పుడు మాట్లాడుతున్నారు'

Bandi Sanjay: హుజూరాబాద్​లో తెరాసకు అభ్యర్థి కరవయ్యారు: బండి సంజయ్

Bandi Sanjay: 'హుజూరాబాద్​ ఉపఎన్నిక కోసమే కొలువుల నాటకం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.