సమాచార హక్కు చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార రక్షణ చట్టం కార్యనిర్వహణ అధ్యక్షుడు కొమ్మట అశోక్. పట్టణంలో కమిటీ సమావేశం నిర్వహించారు. ఎవరికైనా అన్యాయం జరిగితే సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో నూతనంగా ఎన్నుకోబడిన వారికి సొసైటీ ఆర్టీఐ గుర్తింపు కార్డులను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ రాజు, జిల్లా కార్యదర్శి చెక్కపల్లి శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులుగా జంగం నరేశ్, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, చందుర్తి మండల అధ్యక్షుడు బత్తుల ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల కృష్ణ హరి, తదితరులు పాల్గొన్నారు.