రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ నలుగురు రైతుల నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేములవాడకు చెందిన చల్ల బాలరాజు, తూర్పాటి శంకర్‌కు చెందిన వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తామని కార్యాలయానికి తిప్పించుకోవడం వల్ల బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సర్వేయర్ అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి : క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు