సిరిసిల్ల పట్టణం పరిధిలోని సర్దాపూర్ నందు గల 17వ పోలీస్ బెటాలియన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని బెటాలియన్ కమాండెంట్ టి.అలెక్స్, కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.
లాక్డౌన్ కారణంగా కార్మికుల కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్ల స్వస్థలాలకు వెళ్లడానికి అనేక కష్టాలు పడుతున్నారని అలెక్స్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.