ETV Bharat / state

వామన్‌రావు దంపతుల హత్య కేసులో సాక్షుల వాంగ్మూలాలు నమోదు

author img

By

Published : Mar 4, 2021, 8:32 PM IST

న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు మరొక నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసులో ఏ-5గా ఉన్న లచ్చయ్యను అరెస్ట్‌ చేసి మంథని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.మరోవైపు ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. మంథని మెజిస్ట్రేట్‌ ముందు 9 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించారు.

వామన్‌రావు దంపతుల హత్య కేసులో సాక్షుల వాంగ్మూలాలు నమోదు
వామన్‌రావు దంపతుల హత్య కేసులో సాక్షుల వాంగ్మూలాలు నమోదు

వామన్‌రావు దంపతుల హత్య కేసులో సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. మంథని మెజిస్ట్రేట్ ముందు 9 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయగా... సాక్షుల్లో వామన్‌రావు తండ్రి, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేసులో ఏ-5 లచ్చయ్యను మంథని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. లచ్చయ్యకు 14 రోజుల రిమాండ్ విధించగా... కరీంనగర్ జైలుకు తరలించారు. వామన్‌రావు దంపతుల కదలికలపై కుంటశ్రీనుకు లచ్చయ్య సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. లాయర్ల హత్యకేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగియడంతో ముగ్గురిని మంథని కోర్టులో హాజరు పరిచారు. కేసుకు సంబధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున...మరో 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అంతకుముందు గోదావరిఖని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు...భారీ బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపర్చారు.

పెద్దపల్లి జిల్లా...కల్వచర్ల వద్ద గతనెల 17న వామనరావు, నాగమణిని వేటకొడవళ్లతో పాశవికంగా నరికి చంపిన కేసులో ముగ్గురు నిందితులు...కుంట శ్రీను, కుమార్, చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకొని లోతుగా విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన కత్తులను పార్వతీ బ్యారేజి నుంచి వెలికి తీయించిన అధికారులు...బుధవారం హత్యకు ముందు రెక్కీ నిర్వహించిన తీరుపై...సీన్​ రీ-కన్ స్ట్రక్షన్ చేశారు. నిందితుల వారం రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. మరో నిందితుడు బిట్టు శ్రీను పోలీస్ కస్టడీ కొనసాగుతోంది.

ఇదీ చదవండి: రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.