ETV Bharat / state

ఊరంతా ఒక్కటై తోచినంత సాయంతో .. చిన్నారి ప్రాణాలు కాపాడి.. - ప్రాణాపాయ స్థితిలో జన్మనిచ్చిన తల్లి మృతి

gudem villagers saved the child life: ఊరూ.. పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు ఇవి ఇటివలీ బలగం సినిమా పాటలోని చరణాలు. అయితే వాటిని నిజం చేసేలా ఊరంతా ఒక్కటై ఓ చిన్ని ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటారు. పెద్దపల్లి జిల్లా గూడెం గ్రామానికి చెందిన తిప్పారపు రమేశ్‌ కుమార్తె హేమలత నెలలు నిండకముందే మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న తల్లి, బిడ్డలను కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హేమలత మృతి చెందగా.. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబం తల్లడిల్లింది.

gudem villagers saved the child life
gudem villagers saved the child life
author img

By

Published : Mar 29, 2023, 7:59 PM IST

ఊరంతా ఒక్కటై తోచినంత సాయంతో .. చిన్నారి ప్రాణాలు కాపాడి..

gudem villagers saved the child life: హేమలత అనే ఆమె నెలలు నిండకముందే ఒక మగ శిశువుకి జన్మనిచ్చి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి ప్రాణం కూడా విషమంగా ఉండడంతో.. ఊరంతా ఒక్కటై ఆ చిన్ని ప్రాణాన్ని కాపాడి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన తిప్పారపు రమేశ్, జమున దంపతులు. అయితే వారి పెద్ద కుమార్తె హేమలత నెలలు నిండకముందే మగ శిశువుకు జన్మనిచ్చింది.

చేయిచేయి కలిపి సాయం చేసిన గ్రామస్థులు: దీంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న తల్లి కొడుకును కరీంనగర్​లోని ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. రమేశ్ నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఉన్న దాంట్లో రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. అయినా కూడా హేమలత ఆరోగ్యం క్షిణించి తుది శ్వాస విడిచింది. చివరకు పుట్టిన శిశువు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఆ కుటుంబం మొత్తం తల్లడిల్లి పోయింది. వారికి ఓదార్పునిచ్చేందుకు ఒక్కసారిగా గ్రామస్థులు చేయిచేయి కలిపారు.

ఏడు నెలల బాబుకి జన్మనిస్తా ఆమె మృత్యువాత పడడం జరిగింది. ఆ బాబు ఇప్పుడు కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో వెంటిలేటర్​ ద్వారా చికిత్స పొందుతున్నాడు. ఈ దయనీయ స్థితిని చూసి గ్రామస్థులం అందరం కలిసి వీళ్ల పరిస్థితిని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి గ్రామస్థులందరూ ఒక పెద్ద మొత్తంలో సహకరించి, ఎవరికి తోచినంత సాయం వారు చేశారు. మొత్తం రూ.43 వేల 500 ఆ కుటుంబానికి గ్రామస్థుల సహకారంతో అందించడం జరిగింది. -స్థానికులు

మేమున్నామంటూ సోషల్​ మీడియాల గ్రూప్ ద్వారా అందరి గుండెలను టచ్ చేశారు. దీంతో రూ.43 వేల 500 సేకరించిన మొత్తాన్ని ఆ చిన్నారి చికిత్స కోసం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మరణించిన హేమలతకు ఊరంతా నివాళులు అర్పించారు. చికిత్స పొందుతున్న ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, ఆ నిరుపేద కుటుంబంలో మరోమారు కన్నీరు కార్చకుండా ఉండాలని వారు ఆ దేవుని వేడుకున్నారు.

ప్రార్థించే పెదవులు కంటే.. సాయం చేసే చేతులు మిన్నా అనే మదర్ థెరిస్సా మహానీయురాలు చెప్పిన మాట. ఈరోజు దానిని గ్రామ ప్రజలందరూ కూడా నిజం చేయడం జరిగింది. ఏడు నెలల గర్భవతి ఒక బాబుకి జన్మనిచ్చి చనిపోయినటువంటి ఈ ఘటనకు గ్రామస్థులందరూ కూడా మానవత్వంతో చలించి, మంచి మనస్సుతోటి.. ఆ బాబుని కాపాడాలని రూ.43 వేల 500 విరాళం అందజేసిన గ్రామస్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. -స్థానికులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.