ETV Bharat / state

'ఎవరు సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి ఆగదు' - Kishan Reddy responded to Singareni

kishan Reddy Comments On Telangana Development: ఎవరు సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనటం లేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.26 వేల కోట్లు వెచ్చించి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తోందని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.

kishan Reddy Comments On Telangana Development

author img

By

Published : Nov 12, 2022, 5:12 PM IST

Updated : Nov 12, 2022, 7:40 PM IST

kishan Reddy Comments On Telangana Development: సింగరేణిని ప్రైవేట్​పరం చేస్తారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో అత్యధిక వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. సింగరేణిని ప్రైవేట్​పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో రోడ్లు, పారిశుద్ధ్యానికి నిధులు ఇస్తుంది కేంద్ర సర్కారు అని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కూడా కేంద్రమే డబ్బులు ఇస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.

అభివృద్ధిలో రాజకీయం చేయబోం: ఈ 8 ఏళ్లల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. కరోనా సమయంలో ప్రతి ఇంటికీ కేంద్రం ఉచితంగా 5 కిలోల బియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఎవరు సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని.. తాము అభివృద్ధిలో రాజకీయం చేయబోమని అన్నారు. యూరియా మీద కేంద్రం భారీగా రాయితీ ఇస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.

కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనటం లేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం ధరను మోదీ ప్రభుత్వం రూ.2 వేలకు పైగా పెంచిందని గుర్తు చేశారు. రూ.26 వేల కోట్లు వెచ్చించి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనుకూలమా.. కాదా అని రైతులు ఆలోచన చేయాలని కోరారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా నేరుగా అన్నదాతల ఖాతాల్లోకి నిధులు జమచేస్తున్నామని కిషన్​రెడ్డి చెప్పారు.

తెలంగాణ సమాజం వీటన్నింటినీ ఆలోచించాలి: 2014 నాటికి కేంద్రం 24 లక్షల కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందని.. ఈరోజు కేంద్రం 142 లక్షల కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 2014 వరకు జాతీయ రహదారులు 2511 కిలోమీటర్లు ఉంటే.. మోదీ హయాంలో మరో 2489 కిలోమీటర్లు పెరిగాయని తెలంగాణ సమాజం వీటన్నింటినీ ఆలోచించాలని కోరారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పూర్తయిందని పేర్కొన్నారు. మరో 800 మెగావాట్ల ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదన్న కిషన్​రెడ్డి.. భూమి ఇచ్చిన వెంటనే ఆసుపత్రి వస్తుందని పేర్కొన్నారు. ఒక్క రామగుండంలోనే కేంద్రం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు.

ఇవీ చదవండి: వెయ్యి మంది కేసీఆర్​లు వచ్చినా మోదీని అడ్డుకోలేరు: కిషన్​రెడ్డి

ప్రారంభించిన రోజే నీటిలో మునిగిపోయిన రేసింగ్ బోటు

Last Updated : Nov 12, 2022, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.