ETV Bharat / state

ఆన్​లైన్​ విద్యకు ఆసరాగా నిలిచిన లయన్స్ క్లబ్ - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలు

కరోనా వల్ల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. వారికి సాయమందించేందుకు లయన్స్ క్లబ్ సంస్థ ముందుకు వచ్చింది. పెద్దపల్లి జిల్లాలోని నిట్టూరు గ్రామ ప్రాథమిక పాఠశాలకు టీవీని ఉచితంగా అందజేసింది.

Tv sponsor to govt primary school by Lions club members in pedaaplii district
ఆన్​లైన్​ విద్యకు ఆసరాగా నిలిచిన లయన్స్ క్లబ్
author img

By

Published : Nov 4, 2020, 7:02 PM IST

పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఉచితంగా టీవీని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్​లైన్​ విద్యకు సరైన సదుపాయాలు లేకపోవడంతో తమ వంతు సహకారం అందిస్తున్నామని వారు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా మరో ఐదు టీవీలు అందిస్తున్నామని వారు వెల్లడించారు. లయన్స్​ క్లబ్ సభ్యులు అందించిన టీవీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు అశోక్​కుమార్, సంపత్ రావు, జైపాల్​ రెడ్డి, రవీందర్​లను అదనపు కలెక్టర్ అభినందించారు.

ఇదీ చూడండి:'ఆ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్​లైన్​లో ఇప్పటిదాకా 6 వేల మంది దరఖాస్తు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.