పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉదయం 5 గంటల నుంచే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు వ్యక్తిగతంగా పత్రాలు రాసుకుని డిపోకు చేరుకున్నారు. డిపో మేనేజర్‌ను కలిసి విధుల్లో చేరతామన్నారు.
పై అధికారుల నుంచి తమకెటువంటి ఆదేశాలు రాలేదని.. కార్మికులు విధుల్లో చేరేందుకు అవకాశం లేదని చెప్పగా కార్మికులు వెనుదిరిగారు. మంథని డిపో ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.