కొత్త రెవెన్యూ చట్టం అమలు కావడం వల్ల రైతన్నలకు ఎంతగానో ప్రయోజనకరంగా మారిందన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు రైతులు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ఆటోలు, బైక్ ర్యాలీలు నిర్వహించగా... ధూం ధాం ఆటపాటలు మహిళల కోలాట ప్రదర్శనతో రాజీవ్ రహదారి గులాబీ మాయమైంది.
ఇదీ చూడండి: దుర్గం సోయగం: సింపోని సంగీతం... భాగ్యనగర మోమున సరికొత్త నగ ఆవిష్కృతం