ETV Bharat / state

నగదు చోరీ చేసి సీసీకెమెరాతో పరార్... - theft in peddapalli

పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఆటోమొబైల్స్​ షాపులో చోరీ జరిగింది. దుకాణంలోని సీసీకెమెరాతో సహా కౌంటర్​లో ఉన్న లక్షా యాభై వేల రూపాయలను ఓ వ్యక్తి దొంగిలించాడు.

theft in automobile shop at manthani in peddapalli district
'సీసీకెమెరాతో సహా నగదు చోరీ'
author img

By

Published : Feb 11, 2020, 5:24 PM IST

'సీసీకెమెరాతో సహా నగదు చోరీ'

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బ్రిడ్జి వద్ద ఉన్న బిట్టు ఆటోమొబైల్స్​ షాపులో చోరీ జరిగింది. ఈరోజు ఉదయం కౌంటర్​లో ఉన్న డబ్బు తీసుకుందామని యజమాని శ్రీనివాస్​ షాపు తెరవగా... శబ్దం వచ్చింది. ఎలుకల వల్ల శబ్దం వచ్చిందనుకుని కౌంటర్​ తెరిచాడు. అందులో గతరాత్రి పెట్టిన లక్షా యాభైవేల రూపాయలు కనిపించకపోయేసరికి ఖంగుతిన్నాడు.

షాపు వెనుకనుంచి శబ్దం వస్తోందని చూడగా... ఓ వ్యక్తి అక్కణ్నుంచి పరారవుతూ కనిపించాడు. అతన్ని వెంబడించినా ఫలితం లేకపోయిందని శ్రీనివాస్​ తెలిపారు. షాపులోని నగదుతో పాటు సీసీకెమెరానూ ఎత్తుకెళ్లాడని వెల్లడించారు.

పోలీసులకు సమాచారం అందించగా... సంఘటనాస్థలికి చేరుకుని వేలి ముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.