ఓ అనాథ యువతికి వివాహం చేసి ఆదర్శంగా నిలిచారు లయన్స్ క్లబ్ సభ్యులు. పెద్దపల్లి జిల్లా రామగుండం తబితా ఆశ్రమం 15 ఏళ్ల క్రితం విజయలక్ష్మి అనే అమ్మాయి చేరదీసింది. అమ్మాయిని వివాహం చేసుకోవడానికి హైదరాబాద్‌కు చెందిన అనల్ జవహర్ ముందుకు రావటంతో లయన్స్ క్లబ్ వివాహం చేసింది
హిందు సంప్రదాయం ప్రకారం తబిత ఆశ్రమం నిర్వహకుల వీరేంద్రనాయక్- విమల దంపతులు కన్యాదానం చేయడానికి ముందుకు రాగ లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా వివాహం చేశారు. వివాహనికి వచ్చిన బంధుమిత్రులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇదీ చదవండి: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు