చలో గుంజపడుగుకు రాష్ట్ర భాజపా పిలుపునిచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులను కిరాతకంగా నరికి చంపిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న భాజపా... నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
ఇందులో భాగంగా... మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బండి సంజయ్ నేడు గుంజపడుగులో పర్యటించనున్నారు. బండి సంజయ్‌తో పాటు భాజపా రాష్ట్ర న్యాయ విభాగం, రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్బీనగర్ నుంచి దాదాపు 300 న్యాయవాదులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. వీరంతా ఉదయం 7 గంటలకు గుంజపడుగుకు బయల్దేరనున్నారు. భాజపా బృందంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: రాజన్నరాజ్యం కాదు.. రామరాజ్యం కావాలి: ఎంపీ అర్వింద్