Singareni workers strike: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(TBGKS) డిసెంబరు 9 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకుంది. పెద్దపల్లి జిల్లా యైటింక్లైన్ కాలనీలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ప్రధానంగా ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలపై కార్మిక సంఘాల నాయకులు చర్చించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. 11 బొగ్గు గనుల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీసిచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని.. ఆ నాలుగు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.
కోల్ ఇండియా(Singareni workers strike against privatisation)లోని 89 బ్లాకులతో పాటు సింగరేణిలోని నాలుగు బ్లాకులకు ఓపెన్ టెండర్ పిలవడం పట్ల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణను ఆదిలోనే అడ్డుకోకపోతే గనులన్నీ ప్రైవేటు పరం అవుతాయని పేర్కొన్నారు. ప్రైవేటీకరణతో వారసత్వ ఉద్యోగాల్లో కోత పడటమే కాకుండా కొత్తగనులు ప్రారంభించే అవకాశాలు ఉండబోవనిస అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణతో ఆర్జిత లాభాలు తగ్గిపోయి అసలుకే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రకమిటీ సమావేశంలో ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లాల కార్మిక సంఘాల నాయకులతో పాటు మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తదిరత నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: rakesh tikait in hyderabad: 'భాజపాకు ఎవరూ ఓటేయొద్దు.. తెరాస వైఖరి సరిగా లేదు'