ETV Bharat / state

రామగుండంలో ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు - Singareni Emergence Celebrations in Ramagundam news

పెద్దపల్లి జిల్లాలో ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు జరిగాయి. రామగుండంలో సింగరేణి జెండాను జీఎం ఆవిష్కరించారు. ఉత్తమ అధికారులు, ఉద్యోగులను జీఎం సన్మానించారు.

singareni
రామగుండంలో ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు
author img

By

Published : Dec 23, 2020, 4:23 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరిఖని సింగరేణి జీఎం జెండాను ఆవిష్కరించారు. జనరల్‌ మేనేజర్‌, కార్మిక నాయకులు పాల్గొని కేకు కోశారు. మిఠాయిలు పంపిణీ చేశారు.

కరోనా నేపథ్యంలో ఏరియాల వారిగా ఉత్సవాలు సాధారణంగా నిర్వహిస్తున్నామని జీఎం పేర్కొన్నారు. కొవిడ్ వల్ల సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించలేక.. పోయామని వెల్లడించారు. ఇప్పుడిప్పుడే గనుల్లో హాజరు శాతం పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

పర్యావరణ పరిరక్షణ కోసం.. సంస్థ ఆధ్వర్యంలో లక్షల మొక్కలు నాటామని వివరించారు. ఈ ఏడాది 682 మందికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందించామని చెప్పారు. అలాగే బొగ్గు గనుల్లో పూర్తి స్థాయిలో రక్షణతో కూడిన ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. కార్మికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామగుండం-1 ఏరియాలో ఉత్తమ అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.