ETV Bharat / state

కూలీల పయనం.. పనులపై ప్రభావం

ఇతర రాష్ట్రాల కూలీలు స్వస్థలాలకు వెళ్తుండటంతో రామగుండంలో నిర్మాణంలో ఉన్న ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్‌), ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే పరిస్థితి నెలకొంది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పనులు 90 శాతం పూర్తి కాగా, తెలంగాణ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి.

shortage of labor in ramagundam during lock down
కూలీల పయనం.. పనులపై ప్రభావం
author img

By

Published : May 9, 2020, 10:10 AM IST

వివిధ రాష్ట్రాలకు చెందిన 6,330 మంది కార్మికులు పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలోని పరిశ్రమల్లో పని చేస్తున్నారు. 21 రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుల్లో పనులు చేస్తుండగా లాక్‌డౌన్‌తో మార్చి 23 నుంచి ప్లాంట్లలో పనులు నిలిపివేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు రాష్ట్రాల వారీగా ఏర్పాట్లు చేయాలని ప్రకటించింది.

90 శాతం పూర్తయిన పనులు

రామగుండం ఎరువుల కర్మాగారంలో మరో రెండు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తే యూరియాతో పాటు అమ్మోనియా ఉత్పత్తి జరుగుతుంది. రూ.6 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ జులైలో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా నడిపిస్తుండగా లాక్‌డౌన్‌తో 40 రోజుల పాటు పనులు నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభించే సమయానికి వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్తున్నారు.

తెలంగాణ ప్రాజెక్టు పనుల్లో జాప్యం

ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో 800 మెగావాట్ల మొదటి యూనిట్‌ వచ్చే నవంబరు నాటికి ఉత్పత్తి దశలోకి రావాల్సి ఉంది. కాగా వలస కూలీలు స్వస్థలాలకు వెళ్తుండటంతో మరింత సమయం పట్టే అవకాశం ఉంది. రూ.10,598 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టులో 3,500 మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. 800 మెగావాట్ల చొప్పున రెండు ప్లాంట్లను నిర్మిస్తున్న ఎన్టీపీసీ మొదటి దశ పనుల్లో నవంబరులో మొదటి యూనిట్‌, 2021 మేలో రెండో యూనిట్‌లో విద్యుత్తు ఉత్పత్తి చేపట్టేందుకు ప్రణాళికలు వేసుకుంది.

6,330 మంది దరఖాస్తు

రామగుండం ప్రాంతంలోని పరిశ్రమల్లో పని చేసే 6,330 మంది వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో వారిని దశలవారీగా పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రైళ్లు, వాహనాల్లో వారిని పంపించేందుకు, ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు సేకరించారు. మొత్తం 6,330 మందిలో ఎక్కువ మంది ఝార్ఖండ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల కూలీలున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.