రామగుండం ఒకటిలో బుధవారం జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం వాయిదా వేసినట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం పదిహేను రోజులపాటు వాయిదా పడినట్లు యాజమాన్యం వెల్లడించింది. రామగుండం ఒకటి ఏరియాలో ప్రారంభించనున్న ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించి... ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసినట్లు యాజమాన్యం తెలియజేసింది.
మంగళవారం ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టులో దాఖలైన ఒక పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపి... కొవిడ్ వ్యాధి విస్తరిస్తున్న తరుణంలో ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణను 15 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని సంబంధిత ప్రభుత్వ శాఖలు, సింగరేణి సంస్థను హైకోర్టు ఆదేశించారు. ఆదేశాలను అనుసరించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి 15 రోజులు వాయిదా వేశామన్నారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ జరిపే సమయాన్ని తర్వాత వెల్లడిస్తామని యాజమాన్యం పేర్కొంది.
ఇదీ చూడండి : హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌కు కొవిడ్ పాజిటివ్