పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ3 పరిధిలోని 3 ఓపెన్ కాస్ట్2లో సలార్ సినిమా షూటింగ్‌ను ఈరోజు ప్రారంభించారు. బొగ్గుగని కార్మికుల నేపథ్యం ఉన్న సన్నివేశాలను చిత్రీకరించేందుకు సినిమా దర్శకుడు సింగరేణిలోని ఉపరితల గనులను పరిశీలించి... ఈరోజు షూటింగ్‌ను ప్రారంభించారు.
![Salar movie shooting starts in Singareni, peddapalli district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-105-29-ocp2loprabaascinimashooting-av-ts10125_29012021130038_2901f_1611905438_428.jpg)
అంతకుముందు సినిమా హీరో ప్రభాస్ గోదావరిఖనిలోని సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌజ్‌లో బస చేశారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ప్రభాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
![Salar movie shooting starts in Singareni, peddapalli districtSalar movie shooting starts in Singareni, peddapalli district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-105-29-ocp2loprabaascinimashooting-av-ts10125_29012021130038_2901f_1611905438_939.jpg)
సలార్ మూవీ షూటింగ్ కోసం.. గత నాలుగు రోజులుగా యూనిట్ సభ్యులు బొగ్గు గనిపై సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేశారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పలు భాషల్లో సలార్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈరోజు చిత్రీకరణ ప్రారంభమవుతోందని తెలిసి.. ప్రభాస్‌ను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. చిత్రం షూటింగ్ కోసం ఎటువంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
![Salar movie shooting starts in Singareni, peddapalli district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-105-29-ocp2loprabaascinimashooting-av-ts10125_29012021130038_2901f_1611905438_674.jpg)
![Salar movie shooting starts in Singareni, peddapalli district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-105-29-ocp2loprabaascinimashooting-av-ts10125_29012021130038_2901f_1611905438_811.jpg)
- ఇదీ చూడండి: ఆ పెళ్లిలో అవమానం జరిగింది.. ఏడ్చేశా