Production stopped in RFCL: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో సాంకేతిక అవరోధాలతో పాటు కరోనా కారణంగా ఉత్పత్తిని నిలిపివేశారు. ఆర్ఎఫ్సీఎల్లోని ప్రిల్లింగ్ టవర్‌లో ఏర్పడిన సాంకేతిక కారణాలతో పాటు పలువురు శాశ్వత, ఒప్పంద ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. సుమారు 120 మంది ఒప్పంద కార్మికులతో పాటు పలువురు శాశ్వత ఉద్యోగులు కరోనా బారిన పడటంతో ఉత్పత్తిని నిలిపివేశారు. ఫ్యాక్టరీలోని కొవిడ్ బాధితులకు 7 రోజుల వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
ప్రతిరోజూ 3,850 టన్నుల యూరియాతో పాటు అమ్మోనియా ఉత్పత్తి ఉద్దేశంతో గతేడాది ఫిబ్రవరిలో ఈ యూనిట్‌ను ప్రారంభించారు. ఉత్పత్తి నిలిపివేయడానికి కారణం సాంకేతిక అవరోధాలని యాజమాన్యం చెబుతున్నా.. మరో వైపు కరోనా కూడా కారణమని తెలుస్తోంది.
ఇదీ చదవండి: బండి సంజయ్ ఫిర్యాదుపై వారికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు