పెద్దపల్లి జిల్లా మంథనిలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా రేణుక ఎల్లమ్మ పట్నాలు నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మూడో రోజు కల్యాణం, నాలుగో రోజు బోనాలు సమర్పించారు. ఐదో రోజు పట్నాల కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలు ఇళ్లలో కొత్తగా చేతికి వచ్చిన పంట బియ్యం, బెల్లంతో బోనం వండి.. డప్పు చప్పుళ్లతో ఎల్లమ్మ దేవాలయానికి చేరుకొని, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని.. అమ్మవారికి పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: ఈనెల 6 నుంచి పోలీసు, రెవెన్యూ సిబ్బందికి టీకా