తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సుల్తానాబాద్ మండలానికి చెందిన సుమన్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విచారించగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు.
గతంలోనూ పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా... వీరిలో ఎలాంటి మార్పు రాలేని రామగుండం అడిషనల్ డీసీసీ అశోక్‌కుమార్ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడానికి కృషిచేసిన సిబ్బందిని డీసీపీ అభినందించారు.