పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన వృత్తి శిక్షణ కార్యక్రమంలో ఈడీ రాజ్ కుమార్ పాల్గొన్నారు. సీఎస్ఆర్ కార్యక్రమం కింద పరిశ్రమ పరిసర గ్రామాలకు చెందిన 225 మంది రైతులకు 12రకాల కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. వీటితోపాటు 1100 మాస్కులను అందించారు.
ఈ సందర్భంగా కరోనా వైరస్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, పలువురు రైతులు, తదితరులు పాల్గొన్నారు.