పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక ప్రాంతంలోని 30వ డివిజన్లో ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మొక్కలు నాటారు. అనంతరం మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో వాతవారణ సమతుల్యతను కాపాడి ఆరోగ్య తెలంగాణాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపటినట్లు ఆయన వెల్లడించారు.
కాలుష్యానికి నిలయంగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. మహిళలు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి డివిజన్లో లక్ష మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.