పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు. ఎవరు మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. 50 డివిజన్లలో తెరాస-18, కాంగ్రెస్-11, భాజపా-6, ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్-9, ఇండిపెండెంట్‌లు-6 స్థానాల్లో విజయం సాధించింది.
3 సార్లు రీకౌంటింగ్
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి 50 డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభించగా.. మధ్యాహ్నం వరకే ఫలితాలు వెల్లడవ్వగా 39వ డివిజన్లో రీకౌంటింగ్లతో సాయంత్రం 5గంటల వరకు ఫలితం రాలేదు. 3 సార్లు రీకౌంటింగ్ చేయగా చివరకు తెరాస అభ్యర్థిపై ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జెట్టి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
ఇదీ చూడండి: బస్తీకా బాద్షా: పట్టణాల్లో గులాబీ పార్టీకి పట్టం.