ETV Bharat / state

అత్యాధునిక అంబులెన్స్​లను ప్రారంభించిన పుట్టమధు - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

పెద్దపల్లి జిల్లాలో అత్యాధునిక అంబులెన్స్​లను జిల్లా పరిషత్​ ఛైర్మన్​ పుట్టమధు ప్రారంభించారు. ఈ అంబులెన్స్​ల ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు.

 అత్యాధునిక అంబులెన్స్​లను ప్రారంభించిన పుట్టమధు

author img

By

Published : May 18, 2021, 4:03 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని 9 మండలాలకు ఉపయోగపడే విధంగా అత్యాధునిక అంబులెన్స్​లను జిల్లా పరిషత్​ ఛైర్మన్​ పుట్టమధు ప్రారంభించారు. మంథని పట్టణంలోని తెరాస క్యాంపు కార్యాలయం వద్ద పుట్ట లింగమ్మ చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఆక్సిజన్​ కలిగి ఉన్న అంబులెన్స్​లను ప్రారంభించారు. ఈ అంబులెన్స్​లు కాటారం, మహాదేవపూర్​, మల్హర్​రావు, మహాముత్తారం, పలిమేల మండలాల ప్రజలకు సేవలందిస్తుంది.

కరోనా విజృంభిస్తున్న వేళ అనేక మంది పేద ప్రజలు ఆక్సిజన్ అందక అవస్థలు ఎదుర్కొంటున్నారని పుట్టమధుకర్ పేర్కొన్నారు. ఈ అంబులెన్స్​ల ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. కరోనా వ్యాధిపట్ల అందరూ ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.