పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామంలో 200 మందికి కరోనా టెస్టులు చేశారు. అందులో ఏడాదిలోపు పిల్లల నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు 58 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.
వైరస్ సోకిన బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి.. వారిని పరామర్శి.. ధైర్యంగా ఉండాలని జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ సూచించారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన పండ్లను పంపిణీ చేశారు. కొవిడ్ 19 బాధితుల్లో మనోధైర్యం నింపడానికి పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చిందని అన్నారు.
కరోనా వచ్చిన వారికి ప్రభుత్వం వైద్యం అందిస్తోందని పేర్కొన్నారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కరోనా నివారణ చర్యల్లో ముందంజలో ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి : అలర్ట్: బయటకు వెళ్తే.. గొడుగు తీసుకెళ్లడం మరవద్దు..!!