పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో 'పోషన్ అభియాన్ 2020'లో భాగంగా తోటల పెంపకం, పోషకాహారంపై కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిఖిల్లా ఆధ్వర్యంలో పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
![poshan abhiyan 2020 awareness programme in peddapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-krn-106-25-angavaadinunchemaarpusaadyam-avb-ts10125_25092020154028_2509f_01893_1055.jpg)
ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాన్ని అంగన్వాడి సెంటర్ల నుంచే ప్రారంభించాలని పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారి ఆకేశ్వర్ అన్నారు. నేటి ఆధునిక కాలంలో మనిషి అనేక రకాల రసాయనాలతో పిచికారి చేసిన కూరగాయాలను, ఆహారధాన్యాలను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో కచ్చితంగా పెరటి తోటలు పెంచాలని సూచించారు. ఈ సెప్టెంబర్ నెలను పోషణ మాసంగా తీసుకుని ఆహార అలవాట్ల గురించి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని అంగన్వాడీ ఉద్యోగులకు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పెరటి తోటలో కాసిన కూరగాయలతో పౌష్టికాహారం అందించాలని సూచించారు.
ఇదీ చదవండిః అలర్ట్: బయటకు వెళ్తే.. గొడుగు తీసుకెళ్లడం మరవొద్దు..!