న్యాయవాద దంపతుల హత్య కేసులో నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును కస్టడీకి కోరుతూ పోలీసులు మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిట్టు శ్రీనును 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను మంథని కోర్టు విచారించనుంది.
ఇదే కేసులో ముగ్గురు నిందితులను వారం రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు వామన్‌రావు దంపతుల హత్యకేసులో మరిన్ని ఆధారాలు రాబడుతున్నారు.