ETV Bharat / state

పోలీసుల పనితీరు మెరుగ్గానే ఉంది: కోలేటి దామోదర్​ - police housing corporation chairman damodhar

తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పోలీస్​ స్టేషన్ల నిర్వహణకు నిధులు కేటాయిస్తోందని పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ ఛైర్మన్​ కోలేటి దామోదర్​ తెలిపారు. రాష్ట్రంలో పోలీస్​ శాఖ కోసం అనేక చోట్ల భవనాలు నిర్మిస్తున్నామన్నారు.

ramagundam commissionarate
పోలీసుల పనితీరు మెరుగ్గానే ఉంది: కోలేటి దామోదర్​
author img

By

Published : Mar 6, 2020, 1:20 PM IST

పోలీసుల పనితీరు మెరుగ్గా ఉందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్​ కోలేటి దామోదర్ అన్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం కమిషనరేట్​ కార్యాలయం పరిధిలో నిర్మిస్తున్న పోలీస్ భవనాల పనులను సీపీ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు.

నిర్మాణంలో జాప్యానికి కారణాలపై గుత్తేదారులతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రామగుండం కమిషనరేట్​తోపాటు రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేపట్టిన పోలీస్​ శాఖ భవనాలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పోలీస్​ స్టేషన్లల నిర్వహణకు నెలకు రూ. 25 వేల నుంచి 75 వేలు విడుదల చేస్తోందని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్​ను ఇతర రాష్ట్రాల సీఎంలు కొనియాడినట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో రూ. 400 కోట్లతో అత్యాధునిక హంగులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​ పనులు కొనసాగుతున్నాయన్నారు.

పోలీసుల పనితీరు మెరుగ్గానే ఉంది: కోలేటి దామోదర్​

ఇవీచూడండి: మాజీ సర్పంచ్ పోలీస్​స్టేషన్​ పైనుంచి దూకేశాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.