ETV Bharat / state

మళ్లీ మొదటికి: గీత మా కూతురే... డీఎన్​ఏకి సిద్ధం! - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

అమ్మానాన్నలను కలుసుకోవాలని ఆమె ఐదేళ్లుగా నిరీక్షిస్తూనే ఉంది. దివ్యాంగురాలైన గీత ఇరవై ఏళ్ల కిందట తప్పిపోయి వేరే దేశంలో పదిహేనేళ్లు గడిపింది. కన్నవారి ఆచూకీ కోసం ప్రభుత్వం చొరవతో తిరిగి వచ్చింది. తమ కూతురేనంటూ ఇప్పటికే చాలా కుటుంబాలు ఆమెకోసం క్యూ కట్టాయి. గీత తమ కూతురేనంటూ తాజాగా మరో కుటుంబం ముందుకొచ్చింది. డీఎన్​ఏ పరీక్షకూ తాము సిద్ధమేనని పెద్దపల్లి జిల్లాకు చెందిన బొల్లి స్వామి అన్నారు. గీత వారినీ గుర్తించలేకపోయింది.

one-more-family-from-telangana-came-as-geetha-their-daughter
గీతా మా కూతురే... డీఎన్​ఏకి సిద్ధం!
author img

By

Published : Dec 26, 2020, 12:08 PM IST

మూగ అమ్మాయి గీత తమ కూతురేనంటూ రాష్ట్రంలోని మరో కుటుంబం ముందుకొచ్చింది. పెద్దపల్లి జిల్లాకి చెందిన బొల్లి స్వామి కుటుంబం గీత తమ బిడ్డే అంటూ విలపిస్తున్నారు. దశాబ్దం కింద తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన గీత కోసం ఇప్పటికే చాలా కుటుంబాలు వచ్చాయి. వారెవరినీ గీత గుర్తించలేకపోయింది.

one-more-family-from-telangana-came-as-geetha-their-daughter
సైగలతో వివరణ

గీత తమ బిడ్డే అంటూ మీడియా ముందుకొచ్చిన బొల్లి స్వామి తమ కూతురు కోసం చాలా కాలంగా వెతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో తమకు ఓ పాప జన్మించిందని... ఆమెకు చిన్నప్పటి నుంచి మాటలు రావని బొల్లి స్వామి తెలిపారు. గీత తమ కూతురేనని అందుకు డీఎన్​ఏ పరీక్షకూ తాను సిద్ధమేనని అన్నారు. పాప కనబడకుండా పోయినప్పటి నుంచి రోజూ తనకోసం గాలిస్తున్నామని వాపోయారు.

తన తల్లిదండ్రుల కోసం ఇంకా గాలిస్తున్నట్లు గీతా పేర్కొన్నారు. పదిహేనేళ్ల క్రితం పాకిస్థాన్ నుంచి వచ్చిన గీత తమ కూతురేనంటూ చాలా కుటుంబాలు ముందుకు వచ్చాయి. తాజాగా బొల్లి స్వామి కుటుంబాన్ని ఆమె గుర్తించలేకపోయింది.

గీతా మా కూతురే...

దివ్యాంగురాలు గీత తనకు ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒంటరిగా రైలులో పాకిస్థాన్​కు వెళ్లింది. 20 ఏళ్ల కింద తప్పిపోయిన ఆమె అక్కడున్న సేవా సంస్థ ఈద్​ ఫౌండేషన్​లో 15 ఏళ్లు గడిపింది. వారే ఆమెకి గీతా అని నామకరణం చేశారు. 2015, అక్టోబర్ 26న విదేశీ వ్యవహాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో ఆమెను భారత్​కు తీసుకొచ్చారు. గీత తల్లిదండ్రుల గాలింపు కోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని సుష్మా హామీ ఇచ్చారు.

అప్పటి నుంచి ఆమె మధ్యప్రదేశ్​లోని ఆనంద్ సర్వీస్ సొసైటీ సేవా సంస్థలో ఆశ్రయం పొందుతున్నారు. గీత వయసు ప్రస్తుతం ముప్పై ఏళ్లు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.